Virat Kohli: టెన్షన్ సమయం.. చేతులు జోడించి దేవుడ్ని ప్రార్థించిన కోహ్లీ!

Kohli reaction to Jadejas LBW survival in India vs Pakistan game
  • భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ప్రత్యేక హావభావాలు
  • డగ్స్ లో కూర్చుని టెన్షన్ గా వీక్షణ
  • జడేజా ఎల్బీడబ్ల్యూ కోసం పాక్ బౌలర్ క్లెయిమ్ 
విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ ను కోల్పోవడంతో విమర్శల పాలవుతున్నాడు. కానీ, అంతకుముందు వరకు అతడు సుదీర్ఘకాలం పాటు మంచి ప్రదర్శనతో భారత్ విజయాలకు తోడ్పడినవాడే. తన కెరీర్ లో ఎన్నో రికార్డులు నమోదు చేసిన స్టార్ బ్యాట్స్ మ్యాన్. బ్యాటింగ్ లో గతంలో మాదిరి సత్తా చాటలేకపోవచ్చు. కానీ, ఇప్పటికీ ఫీల్డింగ్ లో అతడు గొప్ప నైపుణ్యాలు చూపిస్తూనే ఉన్నాడు. 

మరింతగా చెప్పుకోవాలంటే, మైదానంలో ఆడే సమయంలో, డగ్స్ లో కూర్చున్న సమయంలోనూ అతడు తన హావభావాలను దాచుకోలేడు. ప్రత్యర్థి వికెట్ పడిందంటే వళ్లంతా విరిచేస్తూ, అరుస్తూ సంబరం చేసుకోవాల్సిందే. సొంత జట్టు వికెట్ పడితే అతడు కుదేలైపోవడాన్ని కూడా గమనించొచ్చు. 

నిన్నటి భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగడం తెలిసిందే. పాక్ జట్టును 150 పరుగుల్లోపు కట్టడి చేసినప్పటికీ.. భారత జట్టు కూడా పాక్ బౌలర్ల వాడికి తడబడింది. పిచ్ పై పెద్దగా పరుగులు పారడం లేదు. జడేజా, పాండ్యా భారత్ విజయం కోసం పోరాడుతున్నారు. ఈ తరుణంలో జడేజా ఎల్బీడబ్ల్యూ కోసం క్లెయిమ్ చేసిన సమయంలో.. స్టేడియంలో కూర్చున్న కోహ్లీ టెన్షన్ తో రెండు చేతులు తలపై పెట్టుకోవడం, పైకి ఎత్తి దేవుడ్ని ప్రార్థించడం కెమెరాలకు చిక్కింది. దాన్ని ట్విట్టర్లో అభిమానులు షేర్ చేసుకుంటున్నారు.
Virat Kohli
reaction
India vs Pakistan
asia cup

More Telugu News