Sushmita Sen: మాజీ బోయ్ ఫ్రెండ్ తో షాపింగ్ కు వెళ్లిన సుస్మిత సేన్

Sushmita sen went to shopping with her Ex boy friend
  • రోమాన్ షాల్ తో కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన సుస్మిత
  • ప్రస్తుతం లలిత్ మోదీతో డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ నటి   
  • తాజాతా తన పెంపుడు కుమార్తె, రోమాన్ లతో షాపింగ్ కు వెళ్లిన వైనం
ఇటీవలి కాలంలో బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తన అఫైర్లతో పతాక శీర్షికల్లో నిలుస్తోంది. తన కంటే చాలా చిన్నవాడైన రోమాన్ షాల్ తో ఆమె ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసందే. కొన్నేళ్ల పాటు వీరి సహజీవనం కొనసాగింది. ఇటీవలే వీరిద్దరూ విడిపోయారు. ఇది జరిగి నెల రోజులు కూడా గడవకుండానే లలితో మోదీతో డేటింగ్ ప్రారంభించింది. వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు చూసి అందరూ షాక్ అయ్యారు. 

అయితే, లలిత్ మోదీతో బంధాన్ని కొనసాగిస్తూనే, తన మాజీ లవర్ రోమాన్ తో కలిసి ఆమె మీడియా కంట పడింది. అతనితో కలసి సుస్మిత షాపింగ్ కు వెళ్లింది. అంతేకాదు, వీరితో పాటు సుస్మిత పెంపుడు కుమార్తె రేనీ కూడా ఉంది. వీరు ముగ్గురూ కలిసి ఫొటోలకు పోజులు కూడా ఇచ్చారు. దీనిపై నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ రోమాన్ తో ఉంటే... అక్కడ లలిత్ మోదీ పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Sushmita Sen
Rohman Shal
Bollywood

More Telugu News