హిట్ మూవీ డైరెక్టర్ తో బెల్లంకొండ శ్రీనివాస్!

  • 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బిజీగా బెల్లంకొండ
  • వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 
  • బెల్లంకొండకి కథ వినిపించిన టీఎన్ సంతోష్ 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ హీరో  
Bellamkonda Srinivas in TN Santhosh Movie

బెల్లంకొండ శ్రీనివాస్ మంచి ఒడ్డూ పొడుగు ఉన్న హీరో. తొలి సినిమాతోనే మాస్ ఇమేజ్ ను తెచ్చుకున్న హీరో. ఆయన సినిమాల్లో మాస్ యాక్షన్ పుష్కలంగా ఉండటం వల్లనే, డబ్బింగ్ సినిమాలతో హిందీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు. ఈ క్రేజ్ కారణంగానే అక్కడి ప్రేక్షకుల ముందుకు నేరుగా వెళ్లాలనే ఉద్దేశంతో 'ఛత్రపతి' రీమేక్ ను ఎంచుకున్నాడు. 

వినాయక్ దర్శకత్వంలో 'ఛత్రపతి'ని పూర్తిచేసిన తరువాతనే మళ్లీ తెలుగు సినిమా మొదలుపెట్టాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా 'ఛత్రపతి' సినిమా షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండేళ్లు కావొస్తుండటంతో, ఇక లాభం లేదనుకుని తెలుగు సినిమా కోసం ఒక డైరెక్టర్ కి ఓకే చెప్పినట్టుగా సమాచారం.

బెల్లంకొండతో గ్రీన్ సిగ్నల్ అందుకున్న ఆ దర్శకుడు ఎవరో కాదు .. టీఎన్ సంతోష్. ఇంతకుముందు నిఖిల్ తో ఆయన చేసిన 'అర్జున్ సురవరం' హిట్ అయింది. ఆయన వినిపించిన కథ నచ్చడంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే చెప్పాడని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావొచ్చని అంటున్నారు.

More Telugu News