భయపడితే పాము కాటేసేదే.. కానీ యుక్తి ప్రదర్శించిన మహిళ
- చెట్టు కింద మంచంపై పడుకుని ఉన్న మహిళ
- ఆమె నడుము భాగంలో చేరి పడగ విప్పిన కోబ్రా
- కదలకుండా అలానే ఉండిపోవడంతో అక్కడి నుంచి వెళ్లిన పాము
చెట్టు కింద నవారు మంచంపై మధ్య వయసున్న ఓ మహిళ పడుకుని ఉంది. నాగుపాము ఆ మహిళ నడుము భాగంలో చేరి పడగ విప్పి నుంచొంది. కొంచెం కదిలినా కాటు వేయడం ఖాయమన్నట్టుగా కనిపిస్తోంది. కానీ, ఆ మహిళ మాత్రం కొంచెం కూడా కదల్లేదు. బోర్లా పడుకుని, రెండు చేతులతో దేవుడ్ని ప్రార్థిస్తూ నిశ్చలంగా అలాగే ఉండిపోయింది. సమీపంలోనే ఉన్న ఆవు దూడ సైతం ఆ పామును పరిశీలనగా చూస్తోంది. కొన్ని నిమిషాల పాటు ఆ మహిళపై పడగ విప్పి ఉన్న తర్వాత పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది.