Ram: బోయపాటి సినిమాలో కొత్తగా కనిపించనున్న రామ్!

Ram and Boyapati movie update
  • రెండు ఫ్లాపులతో ఉన్న రామ్
  • నెక్స్ట్ మూవీ బోయపాటితో
  • ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ 
  • హీరోయిన్ గా తెరపైకి రష్మిక పేరు
'ఇస్మార్ట్ శంకర్' తరువాత రామ్ చేసిన 'రెడ్' .. 'ది వారియర్' సినిమాలు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. రామ్ ఆ తరువాత సినిమాను బోయపాటితో చేస్తున్నాడు. 'అఖండ' తరువాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన అందరూ కూడా ఈ సినిమాపై దృష్టి పెట్టారు.

ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే టాక్ ముందుగానే బయటికి వచ్చింది. ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యం పూర్తి భిన్నంగా ఉంటుందట. అందులో ఒక పాత్ర కోసం రామ్ 10 కేజీలకి పైగా బరువు పెరగనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నాడని చెబుతున్నారు. ముందుగా బరువు పెరిగిన పాత్ర తాలూకు షూటింగ్ ఉంటుందట. 

ఆల్రెడీ 'ది వారియర్' సినిమా కోసం రామ్ కొంతవరకూ బరువు పెరిగాడు. ఇప్పుడు మరింత బరువు పెరగనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక పేరు వినిపిస్తోంది. మాస్ అంశాలతోను .. ఎమోషన్స్ తోను కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Ram
Rashmika Mandanna
Boyapati Movie

More Telugu News