Team India: ఆసియా కప్: రాణించిన టీమిండియా బౌలర్లు... పాక్ 147 ఆలౌట్

  • దుబాయ్ వేదికగా మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • పరుగుల కోసం కష్టపడిన పాక్
  • నాలుగు వికెట్లు తీసిన భువనేశ్వర్
  • 3 వికెట్లతో రాణించిన హార్దిక్ పాండ్యా
Team India controls Pakistan for 147 runs in Asia Cup match

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు, ఫీల్డర్లు అమోఘంగా రాణించారు. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా3 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టారు. అర్షదీప్ సింగ్ 2, అవేష్ ఖాన్ 1 వికెట్ దక్కించుకున్నారు. స్పిన్నర్లు చహల్, జడేజా ఒక్క వికెట్టు తీయలేకపోయారు. 

పాక్ జట్టులో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇఫ్తికార్ అహ్మద్ 28 పరుగులు సాధించాడు. కెప్టెన్ బాబర్ అజామ్ (10), ఫకార్ జమాన్ (10), కుష్దిల్ షా (2) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. చివర్లో దహాని (6 బంతుల్లో 16), హరీస్ రవూఫ్ (7 బంతుల్లో 13 నాటౌట్) ధాటిగా ఆడడంతో పాకిస్థాన్ కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

More Telugu News