సీనియర్ నటుడు విద్యాసాగర్ రాజు కన్నుమూత

28-08-2022 Sun 18:01
  • ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన విద్యాసాగర్ రాజు
  • కొన్నాళ్ల కిందట పక్షవాతానికి గురైన వైనం
  • విషమించిన ఆరోగ్యం
  • కెరీర్ లో సుమారు 100 సినిమాల్లో నటించిన విద్యాసాగర్ రాజు
Senior actor Vidyasagar Raju died
తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ నటుడు విద్యాసాగర్ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. విద్యాసాగర్ రాజు కొన్నాళ్ల కిందట పక్షవాతానికి గురయ్యారు. ఈ ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు తెలిపారు. మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు, అహ నా పెళ్లంట, స్వాతిముత్యం, ఆఖరి క్షణం వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యాసాగర్ రాజు తన కెరీర్ లో 100కి పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాదు, ఆయన రచయిత కూడా. 

విద్యాసాగర్ అర్ధాంగి రత్నప్రభ కూడా సినీ నటే. ఆమె జంధ్యాల సినిమాల్లో ఎక్కువగా కనిపించేవారు. విద్యాసాగర్ రాజు తొలుత నాటకాలతో మెప్పించారు. ఆపై సినీ రంగంలో ప్రవేశించి అన్ని తరహా పాత్రలు పోషించారు. 'ఈ చదువులు మాకొద్దు' అనే అభ్యుదయ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు.