Rahul Gandhi: దేశానికేమో ఖాదీ గురించి చెబుతారు... జాతీయ పతాకానికేమో చైనీస్ పాలీయెస్టర్ వస్త్రమా?: ప్రధానిపై రాహుల్ విమర్శలు

Rahul Gandhi criticizes PM Modi Khadi campaign
  • అహ్మదాబాద్ లో నిన్న ఖాదీ ఉత్సవ్
  • పాల్గొన్న ప్రధాని మోదీ
  • ఖాదీ విశిష్టత గురించి వివరణ
  • ప్రధాని మాటలకు చేతలకు పొంతన ఉండదన్న రాహుల్ 
ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే మాటలకు, చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ స్వప్నం సాకారం కావడానికి ఖాదీ ఓ స్ఫూర్తిదాయక వనరు అని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న అహ్మదాబాద్ లో నిర్వహించిన ఖాదీ ఉత్సవంలో వ్యాఖ్యానించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, దేశానికేమో ఖాదీ గురించి చెబుతుంటారు... కానీ జాతీయ పతాకానికేమో చైనా పాలియెస్టర్ వస్త్రం కావాలి అని విమర్శించారు.

కేంద్రం ఇటీవల జాతీయ పతాకం కోడ్ ను సవరించింది. త్రివర్ణ పతాకాన్ని చేతితో ఒడికిన, చేతితో నేసిన, యంత్రంతో తయారైన, కాటన్, పాలీయెస్టర్, వూల్, సిల్క్, ఖాదీ వస్త్రాలతోనే తయారుచేయాలని సవరణ చేశారు. గతంలో యంత్రాల ద్వారా రూపొందించినవి, పాలీయెస్టర్ వస్త్రంతో తయారైనవి అనుమతించేవారు కాదు. ఇప్పుడు కేంద్రం సవరణ చేసిన నేపథ్యంలో రాహుల్ పైవిధంగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
Rahul Gandhi
Narendra Modi
Khadi
National Flag
Congress
BJP
India

More Telugu News