Komatireddy Raj Gopal Reddy: మునుగోడులో బీజేపీ గెలిస్తే నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Raja Gopal Reddy comments on latest developments
  • కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా
  • మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక
  • ప్రాణం ఉన్నంతవరకు మునుగోడును వదిలిపెట్టబోనని వెల్లడి
ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ను వీడిన ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దాంతో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. దేశం మొత్తం మునుగోడు వైపు చూస్తోందని తెలిపారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే, నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకు మునుగోడును వదిలిపెట్టనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ లో చేరితేనే ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తారని ఆరోపించారు. నియోజకవర్గ సమస్యలపై కేసీఆర్ తో మాట్లాడే దమ్ము టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదని విమర్శించారు. ఈసారి ఇంటికి కిలో బంగారం ఇచ్చినా టీఆర్ఎస్ కు ఓటేయరని వ్యాఖ్యానించారు.
Komatireddy Raj Gopal Reddy
Munugodu
BJP
TRS
By Polls
Telangana

More Telugu News