Plane: వేగంగా వెళుతున్న విమానం హఠాత్తుగా గాల్లోనే ఆగిపోతే.. వైరల్​ వీడియో ఇదిగో!

  • వీడియోను ఆన్ లైన్ లో పెట్టిన టిక్ టాకర్
  • ఎదురుగాలి వేగం, పైన ప్రయాణించే మేఘాల వల్లే అలా కనిపిస్తుందంటున్న నిపుణులు
  • ఆన్లైన్ లో వైరల్ గా మారిన వీడియో.. చిత్రంగా ఉందంటూ కామెంట్లు
Plane stopped mid flight and floating in the sky

సాధారణంగా విమనాలు అత్యంత వేగంగా దూసుకుపోతుంటాయి. ఆకాశంలో మరీ ఎత్తున ఎగురుతున్నప్పుడు మాత్రం కాస్త మెల్లగా ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంటుంది. కానీ ఆకాశంలో దూసుకెళ్తున్న విమానం మధ్యలో గాలిలోనే ఆగిపోతే.. వామ్మో అనిపిస్తుంటుంది కదా.. ఇటీవల అమెరికాలో ఇలాంటి ఘటనే జరిగింది. దీనిని జెన్నిఫెరిరోనియోటో అనే టిక్ టాకర్ వీడియో తీసి ఆన్ లైన్ లో పెట్టడంతో వైరల్ గా మారింది.

ఆకాశంలో ఆగిపోయింది

  • ఆ వీడియోలో.. కొందరు ఓ వీధిలో నిలబడి ఉండగా ఒకరు ఆకాశం వైపు చూసి ఆశ్చర్యంతో.. ‘‘ఆకాశంలో విమానం ఆగిపోయింది. కదలకుండా ఒకే చోట ఉంది. కానీ అది కదులుతున్నట్టుగా చప్పుడు మాత్రం వస్తోంది’ అని చెప్తున్నారు. ఆకాశంలో విమానంవైపు చూస్తే.. అది నిజంగానే ఒకే చోట ఉన్నట్టుగా కదలకుండా కనిపిస్తోంది.
  • ఈ వీడియోను కొందరు రెడ్డిట్ వెబ్ సైట్లో పోస్టు చేసి ఎవరైనా నిపుణులు దీనికి కారణం చెప్పగలరా అని ప్రశ్నించగా.. పెద్ద సంఖ్యలో సమాధానాలు వచ్చాయి.
  • ‘‘ఆకాశంలో అంత ఎత్తున గాలి అత్యంత వేగంగా వీస్తుంటుంది. ఒక్కోసారి అలా వీచినప్పుడు విమానం వేగం బాగా తగ్గిపోతుంది. గాలి వేగం తగ్గాకగానీ విమానం వేగం పుంజుకోదు. అలాంటి సమయంలో మనకు అది కదలకుండా ఉన్నట్టు కనిపిస్తుంది..” అని ఒక నిపుణుడు వివరణ ఇచ్చారు.
  • “ఎదురుగాలి వేగానికి తోడు.. విమానానికి పైన మేఘాలు దాదాపు అదే వేగంతో పయనిస్తుండటం వల్ల విమానం ముందుకు కదిలినా కదలనట్టు అనిపిస్తుంది..” అని మరో నిపుణుడు వివరణ ఇచ్చారు. 
  • ‘‘ఇది చూడటానికి సరదాగా కనిపిస్తుందిగానీ.. ఆ విమానం నడుపుతున్న వారికి మాత్రం పెద్ద చాలెంజ్ ఎదురైనట్టే. విమానాన్ని కంట్రోల్ లో ఉంచడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది” అని వైమానిక రంగ నిపుణులు పేర్కొన్నారు.
 

More Telugu News