Vijayasai Reddy: చంద్రబాబుకు నిజమైన ముప్పు కుప్పం ప్రజల నుంచే!: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy responds on NSG Security hike to Chandrababu
  • ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తతలు
  • చంద్రబాబుకు ఎన్ఎస్ జీ భద్రత పెంపు
  • 24 మంది కమాండోల కేటాయింపు
  • చంద్రబాబుపై కుప్పం ప్రజలు మండిపడుతున్నారన్న విజయసాయి
టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల చంద్రబాబు పర్యటనల్లో తరచుగా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిరోజుల కిందట కుప్పం పర్యటన సందర్భంగా పలు ఘటనలతో వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో, ఎన్ఎస్ జీ డీఐజీ చంద్రబాబు భద్రతను సమీక్షించారు. ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న టీడీపీ అధినేతకు 12 ప్లస్ 12 విధానంలో 24 మందితో భద్రతను పెంచింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. 

చంద్రబాబుకు 24 మంది ఎన్ఎస్ జీ కమాండోలతో భద్రత కల్పిస్తున్నారని, ఇప్పుడు టీడీపీకున్న 23 మంది ఎమ్మెల్యేల సంఖ్య కంటే చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువమంది ఉన్నారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి చంద్రబాబుకు కుప్పం ప్రజల నుంచే నిజమైన ముప్పు పొంచి ఉందని విజయసాయి పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటూ కుప్పం ప్రజలు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వివరించారు.
Vijayasai Reddy
Chandrababu
NSG
Security
Kuppam
TDP

More Telugu News