బిల్కిస్ బానో దోషుల విడుదల విషయం తెలిసి ఆశ్చర్యపోయాం.. వారిని మళ్లీ జైలుకు పంపండి: సీజేఐకి మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ
- దోషుల విడుదల ద్వారా భయంకరమైన తప్పిదం జరిగిందని లేఖ
- వారిని తిరిగి జైలుకు పంపడం ద్వారా తప్పును సరిదిద్దాలని అభ్యర్థన
- గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం తమను ఆశ్చర్యపరిచిందంటూ లేఖ
స్వాతంత్ర్య దినోత్సవాన దేశంలోని ప్రజలు అందరిలానే తాము కూడా గుజరాత్‌లో చోటుచేసుకున్న పరిణామాలు చూసి ఆశ్చర్యపోయామని ఆ లేఖలో పేర్కొన్నారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంతో తాము ఎంతగానో బాధపడ్డామని, అందువల్లే ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. ఈ లేఖ రాసిన 134 మందిలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్, మాజీ కేబినెట్ కార్యదర్వి కె.ఎం.చంద్రశేఖర్, మాజీ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శులు శివశంకర్ మీనన్, సుజాతాసింగ్, మాజీ హోం కార్యదర్శి జి.కె.పిళ్లై తదితరులు ఉన్నారు.