YSRCP: 3 నెల‌ల్లో స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదో ఇక గాంధీ గిరీనే: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి

  • నెల్లూరు జిల్లా అభివృద్ధి క‌మిటీ స‌మావేశానికి హాజ‌రైన కోటంరెడ్డి
  • వావిలేటిపాడు జ‌గ‌న‌న్న కాల‌నీ దుస్థితిని వివ‌రించిన వైసీపీ ఎమ్మెల్యే
  • 3 నెల‌ల్లోగా భూమిని చ‌దును చేయాల‌ని అధికారుల‌కు అల్టిమేటం
ysrcp mla kotamreddy sridhar reddy ultimatum to officials on local issues

అధికార పార్టీలో ఉన్నా, విప‌క్షంలో ఉన్నా... త‌న‌ను గెలిపించిన ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల కోసం నిర‌స‌న‌కు దిగేందుకు ఏమాత్రం వెనుకాడ‌ని నేత‌లు కొంద‌రు ఉంటారు. అలాంటి వారిలో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ముందు వ‌రుస‌లో ఉంటార‌నే చెప్పాలి. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ఎప్ప‌టిక‌ప్పుడు అధికార యంత్రాంగాన్ని ఉరుకులు ప‌రుగులు పెట్టించే కోటంరెడ్డి... స‌మ‌స్య ప‌రిష్కారం కాకుంటే అక్క‌డిక‌క్క‌డే నిర‌స‌న‌కు దిగి అధికారులకు షాకిస్తుంటారు.

తాజాగా శ‌నివారం జ‌రిగిన నెల్లూరు జిల్లా అభివృద్ధి క‌మిటీ స‌మావేశంలో భాగంగా ఓ కీల‌క అంశాన్ని ప్ర‌స్తావించిన కోటంరెడ్డి... ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు 3 నెల‌ల డెడ్ లైన్‌ను విధించారు. డెడ్ లైన్‌లోపు స‌మ‌స్య ప‌రిష్కారం కాకపోతే గాంధీ గిరీ త‌ర‌హా నిర‌స‌న‌కు దిగుతాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 

త‌న నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని వావిలేటిపాడులో పేద ప్ర‌జ‌ల ఇళ్ల కోసం ఏర్పాటు చేసిన జ‌గ‌న‌న్న కాల‌నీలో ఇప్ప‌టిదాకా భూమిని చ‌దునే చేయ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ఫ‌లితంగా చిన్న‌పాటి వ‌ర్షానికి కూడా కాల‌నీ చెరువును త‌ల‌పిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. 3 నెల‌ల్లోగా కాల‌నీ భూమిని చ‌దును చేయాల‌ని ఆయ‌న అధికారుల‌కు అల్టిమేటం జారీ చేశారు. లేదంటే త‌న గాంధీ గిరీ ఏమిటో చూస్తారంటూ ఆయ‌న హెచ్చ‌రించారు.

More Telugu News