Telangana: జేపీ న‌డ్డాతో భేటీ కానున్న మై హోం గ్రూపు అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర్‌ రావు

tv9 owner jupalli rameswar rao will meet jp nadda this night
  • వ‌రంగ‌ల్ బీజేపీ స‌భ కోసం తెలంగాణ వ‌చ్చిన న‌డ్డా
  • ఇప్ప‌టికే న‌డ్డాతో భేటీ అయిన మిథాలీ రాజ్‌
  • ఈ రాత్రికి న‌డ్డాతో భేటీ కానున్న హీరో నితిన్‌
  • ఆ తర్వాత జూప‌ల్లితో భేటీ కానున్న బీజేపీ అధ్యక్షుడు 
తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను రాష్ట్రానికి చెందిన ఇతర రంగాల ప్ర‌ముఖులు క‌లుస్తున్నారు. ఇప్ప‌టికే మాజీ క్రికెట‌ర్ మిథాలీ రాజ్ ఆయ‌న‌తో భేటీ కాగా... ఈ రాత్రికి టాలీవుడ్ యువ హీరో నితిన్ కూడా భేటీ కానున్నారు. తాజాగా జేపీ న‌డ్డాతో భేటీ కాబోయే ప్ర‌ముఖుల జాబితాలో టీవీ9 అధినేత‌, మై హోం గ్రూపు అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు కూడా చేరారు. 

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో కొన‌సాగుతున్న బ‌హిరంగ స‌భ‌లో జేపీ న‌డ్డా ఉన్నారు. ఈ సభ ముగిసిన త‌ర్వాత హెలికాప్ట‌ర్ ద్వారా ఆయ‌న శంషాబాద్ చేరుకుంటారు. ఈ సంద‌ర్భంగా నోవాటెల్‌లో కాస్తంత సేపు విశ్రాంతి తీసుకోనున్న జేపీ న‌డ్డాతో జూప‌ల్లి భేటీ కానున్నారు.  
Telangana
BJP
JP Nadda
TV9
My Home Group
Jupalli Rameswar Rao

More Telugu News