YSRCP: జగన్ గారిని చూస్తుంటే హలోబ్రదర్ సినిమాలో విలన్ గుర్తుకు వస్తున్నాడు: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి

tdp mla gorantla says that jagan plastic ban comments camein the view of pawan kalyan birth daycelebrations
  • శుక్ర‌వారం విశాఖ‌లో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌
  • ప్లాస్టిక్ ర‌హిత ఏపీ దిశ‌గా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పిలుపు
  • ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజున ఫ్లెక్సీలు క‌నిపించ‌కూడ‌ద‌నే ఈ పిలుపు అన్న గోరంట్ల‌
విశాఖ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్లాస్టిక్‌ను నిషేధిద్దామంటూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన పిలుపుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ స్పందించిన కాసేప‌టికే టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కూడా స్పందించారు. ప్లాస్టిక్ వాడ‌కం నిషేధం దిశ‌గా జ‌గ‌న్ ఇచ్చిన పిలుపు వెనుక ఇంకో కార‌ణం ఉందంటూ ఆయ‌న సెటైర్ సంధించారు.

సెప్టెంబ‌ర్ 2న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్ డే ఉన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న ఫ్యాన్స్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫ్లెక్సీల‌న్నీ ప్లాస్టిక్‌తోనే చేస్తున్న‌వే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన గోరంట్ల... ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు బ్యాన్ చేస్తున్న జగన్ గారిని చూస్తుంటే హలోబ్రదర్ సినిమాలో విలన్ గుర్తుకు వస్తున్నాడు అంటూ సెటైర్ వేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజున ఫ్లెక్సీలు క‌నిపించ‌కూడ‌ద‌న్న భావ‌న‌తోనే జ‌గ‌న్ ఈ పిలుపు ఇచ్చార‌ని ఆయ‌న ఆరోపించారు.
YSRCP
Vizag
YS Jagan
Plastic
TDP
Gorantla Butchaiah Chowdary
Janasena
Pawan Kalyan

More Telugu News