Justice N.V. Ramana: మాజీ సీజేఐ ఎన్వీ రమణను కలిసిన తెలంగాణ మీడియా ఛైర్మన్ అల్లం నారాయణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

Telangana journalist unions leaders meets Justive NV Ramana
  • తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో సానుకూల తీర్పును వెలువరించిన జస్టిస్ ఎన్వీ రమణ
  • ధన్యవాదాలు తెలిపిన జర్నలిస్టు సంఘాల నేతలు
  • జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వైనం

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జర్నలిస్ట్ సంఘాల నేతలు కలుసుకున్నారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన వీరు ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో ఆయనను సత్కరించారు. తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో రెండు రోజుల క్రితం సానుకూల తీర్పును ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సందర్భంగా అల్లం నారాయణతో పాటు జర్నలిస్టు సంఘాల నేతలతో జస్టిస్ ఎన్వీ రమణ పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. 'కొలిమి అంటుకున్నది' అనే పుస్తకం గురించి కూడా ప్రస్తావించారు. మరోవైపు జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, ఢిల్లీ టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News