బోయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు బాలికల మధ్య పోరు.. పరారైన బాలుడు

27-08-2022 Sat 13:35 | National
  • మహారాష్ట్రలోని పైథాన్ లో జరిగిన ఘటన
  • బస్టాప్ లో వేచి ఉన్న ఒక బాలిక
  • ఆమె బోయ్ ఫ్రెండ్ తో కలసి అక్కడికి చేరుకున్న మరో బాలిక
  • ఇద్దరి మధ్య గొడవ
2 girls fight over common boyfriend at Maharashtras bus stand
టీనేజీలో ఉన్నారు. అంత పరిపక్వత లేదు. దాంతో ఒక బోయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు బాలికలు నడి రోడ్డుపై ముష్టి యుద్ధానికి దిగారు. ఇది చూసి భయంతో వారి బోయ్ ఫ్రెండ్ అక్కడి నుంచి పరారయ్యాడు. మహారాష్ట్రలోని పైథాన్ జిల్లా  కేంద్రంలో ఇది జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 

ఒక బాలిక తన బోయ్ ఫ్రెండ్ తో కలసి బస్ స్టాప్ దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది. అదే బోయ్ ఫ్రెండ్ ను ప్రేమించే మరో బాలిక అదే బస్టాప్ లో వేచి ఉంది. వీరిద్దరినీ చూసిన ఆమె కోపంతో వారి దగ్గరకు వచ్చింది. తన బోయ్ ఫ్రెండ్ పక్కనే ఉన్న బాలికతో వాదనకు దిగింది. బస్ కోసం అక్కడే వేచి ఉన్న వారు వీరిని చూసి ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది. 

మరోపక్క, ఇద్దరు బాలికల మధ్య వాగ్యుద్ధం పెరిగియి.. పరస్పరం కొట్టుకుంటున్న దశలో బాలుడు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. బోయ్ ఫ్రెండ్ కోసం కొట్టుకుంటున్న బాలికలను పోలీసులు అక్కడి నుంచి స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత విడిచిపెట్టారు. ఈ బాలికల వయసు 17 ఏళ్లు ఉంటుంది.