Narendra Modi: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా ప్రధాని నరేంద్ర మోదీ

  • సర్వే చేపట్టిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ
  • 22 మంది నేతలతో జాబితా
  • 75 శాతం రేటింగ్ తో నెంబర్ వన్ గా మోదీ
  • బైడెన్ కు ఐదోస్థానం
Narendra Modi as world most popular leader

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీకి 75 శాతం రేటింగ్ రావడం విశేషం. మోదీ తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ రెండో స్థానంలో నిలిచారు. ఓబ్రడార్ కు 63 శాతం రేటింగ్ లభించింది. ఇక, 54 శాతం రేటింగ్ తో ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి మూడో స్థానంలో నిలిచారు. 

మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన జాబితాలో మొత్తం 22 మంది ప్రపంచ నేతలు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (41 శాతం) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో (39 శాతం), జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా (38 శాతం), ఫ్రాన్స్ దేశాధినేత మేక్రాన్ (34 శాతం), జర్మనీ చాన్సలర్ షోల్జ్ (30 శాతం), బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (25 శాతం) ఉన్నారు.

More Telugu News