Justice Uday Umesh Lalit: భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్

  • నేడు పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎన్వీ రమణ
  • సుప్రీంకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి
  • జస్టిస్ లలిత్ తో ప్రమాణస్వీకారం చేయించనున్న రాష్ట్రపతి
Justice Uday Umesh Lalit will swear in as CJI tomorrow

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం నేటితో ముగిసింది. ఆయన ఇవాళ పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో, భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. నూతన సీజేఐగా ఆయనతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్ లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1985 డిసెంబరు వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. ఆ మరుసటి ఏడాది ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీసు షురూ చేశారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అనేక కీలక కేసుల తీర్పుల్లో జస్టిస్ లలిత్ కూడా భాగస్వామిగా ఉన్నారు.

More Telugu News