Panja Vaisshnav Tej: 'రంగ రంగ వైభవంగా' టైటిల్ సాంగ్ రిలీజ్!

  • వైష్ణవ్ తేజ్ హీరోగా 'రంగ రంగ వైభవంగా' 
  • వైష్ణవ్ కి జోడీగా కేతిక శర్మ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • వచ్చేనెల 2వ తేదీన విడుదల  
Ranga Ranga Vaibhavanga title song released

వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ జంటగా 'రంగ రంగ వైభవంగా' సినిమా రూపొందింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 
 
పండుగ వాతావరణంలో సరదాగా .. సందడిగా ఈ పాట సాగిపోతుంది. ఆ సందట్లోనే హీరో హీరోయిన్ల లవ్ మిక్సయి ఉంటుంది. దేవిశ్రీ స్వరపరిచిన ట్యూన్ టైటిల్ కి తగినట్టుగానే ఉంది. సాంగును చాలా కలర్ ఫుల్ గా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. పాటలో దాదాపు అందరు ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. 

సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అవ్వడం వైష్ణవ్ కి చాలా అవసరం. అలాగే రెండు ఫ్లాపుల తరువాత కేతిక చేసిన సినిమా ఇది. ఈ మధ్య కాలంలో విడుదలకి ముందు మంచి బజ్ వచ్చిన సినిమాల్లో ఇది ఒకటి. మరి ఇటు  యూత్ కీ .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందో చూడాలి.

More Telugu News