BJP: రేపు వరంగల్ లో బీజేపీ సభ: అనుమతికై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

TS BJP files lunch motion petition in High Court
  • రేపటితో ముగియనున్న బండి సంజయ్ పాదయాత్ర
  • బీజేపీ బహిరంగసభకు అనుమతిని నిరాకరించిన పోలీసులు
  • సభకు ముఖ్య అథితిగా విచ్చేయనున్న జేపీ నడ్డా
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర రేపటితో ముగియనుంది. వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద రేపు ఉదయం పాదయాత్రను ఆయన ముగించనున్నారు. మరోవైపు రేపు వరంగల్ లో భారీ బహిరంగసభను నిర్వహించాలని బీజేపీ భావించింది. నగరంలోని ఆర్ట్స్ కాలేజీలో సభకు ప్లాన్ చేశారు. సభ కోసం బీజేపీ నేతలు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే, సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. 

దీంతో, ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యం నుంచి కూడా ఇదే రకమైన సమాధానం వచ్చింది. పోలీసుల నుంచి సభకు అనుమతి రాకపోవడంతో బీజేపీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నం 3 గంటలకు సభను నిర్వహించనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
BJP
Rally
Bandi Sanjay
JP Nadda
TS High Court

More Telugu News