Corona Virus: దేశంలో కొత్తగా 10,256 కరోనా కేసులు

  • గత 24 గంటల్లో నమోదైనట్టు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడి
  • వైరస్ వల్ల తాజాగా 68 మంది మృతి
  • ప్రస్తుత క్రియాశీల కేసులు 90,707
India reports 10 256 fresh COVID19 cases

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 4,22,322 టెస్టులు చేయగా కొత్తగా 10,256 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. అదే సమయంలో 13,528 మంది వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 90,707 క్రియాశీల కేసులు ఉన్నాయి. క్రియాశీల కేసుల రేటు 0.20 శాతానికి తగ్గింది. రోజువారీ పాజిటివిటి రేటు 2.43 శాతంగా నమోదైంది. వారపు పాజిటిటీ రేటు 3.02 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.61 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. 

మన దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటిదాకా 4,37,70,913 మంది కోలుకున్నారు. ఇక, గత 24 గంటల్లో కరోనా వల్ల 68 మంది మృతి చెందారు. ఇందులో ఒక్క కేరళలోనే 29 మరణాలు సంభవించాయి. దాంతో, ఇప్పటిదాకా దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,27,556కి చేరుకుంది. ఇక, దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 211.13 కోట్ల డోసులు అందజేశారు. నిన్న ఒక్కరోజే 31,60,292 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.

More Telugu News