Rishi Sunak: భారతీయ సంస్కృతిని చాటిన రిషి సునాక్.. భార్యతో కలసి గోపూజ

Rishi Sunak performs Gau pooja with wife in London wins praise from Indians
  • లండన్ లో పూజ నిర్వహించిన రిషి సునాక్
  • భారతీయుల నుంచి అభినందనలు
  • బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ తో పోటీ
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీపడుతున్న రిషి సునాక్ తన భారతీయ మూలాలను మరోసారి చాటుకున్నారు. భార్య అక్షతా మూర్తితో కలసి లండన్ లో గోపూజ చేశారు. దీనికి బ్రిటన్ లోని భారతీయుల నుంచి అభినందనలు వ్యక్తమవుతున్నాయి. గోవుకు పూజ చేసి హారతి ఇవ్వడాన్ని వీడియోలో చూడొచ్చు. ఇటీవలే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఫొటోలను కూడా రిషి సునాక్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం తెలిసిందే. 

బ్రిటన్ లో ఉంటున్నా.. ఆ దేశ ప్రధానికి పోటీ పడుతున్నా హిందూ సంప్రదాయాలు, పండుగల నిర్వహణలో రిషి ఎప్పుడూ ముందుంటారు. ఆ ప్రభావం తన భవిష్యత్తుపై చూపుతుందేమోనని కూడా ఆయన ఏ మాత్రం సంకోచించరు. గతేడాది దీపావళి సందర్భంగా తన ఇంటి ముందు దీపాలను పెట్టి మరీ వేడుక చేసుకున్నారు. లిజ్ ట్రస్ తో ప్రధాని పదవికి రిషి సునాక్ పోటీలో ఉండగా, ట్రస్ ముందంజలో ఉండడం తెలిసిందే. బ్రిటన్ లో 1.5 మిలియన్ భారతీయులు ఉన్నారు. మొత్తం జనాభాలో ఇది 2.5 శాతానికి సమానం. కానీ, ఆ దేశ జీడీపీలో వీరి రూపంలో సమకూరే వాటా 6 శాతం ఉండడం గమనార్హం.
Rishi Sunak
cow pooja
goseva
london

More Telugu News