Panja Vaisshnav Tej: కేతిక శర్మ టెన్షన్ పడటంలో అర్థముంది పాపం!

  • 'రొమాంటిక్'తో ఫస్టు ఫ్లాప్ అందుకున్న కేతిక 
  • నిరాశపరిచిన 'లక్ష్య' ఫలితం
  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'రంగ రంగ వైభవంగా'
  • వచ్చేనెల 2వ తేదీన సినిమా విడుదల  
Ranga Ranga vaibhavanga Movie Update

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో కేతిక శర్మ ఒకరు. 'రొమాంటిక్' సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె ఎలాంటి మొహమాటాలకు పోకుండా అందాలను ఆరబోసింది. దాంతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. 

అయినా గ్లామర్ పరంగా కేతిక చేసిన మాయాజాలం కారణంగా ఆమెకి 'లక్ష్య' సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమాలో ఆమె గ్లామర్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఆ సినిమా ఫలితం కూడా అందరినీ నిరాశ పరిచింది. అయినా ఆమె 'రంగ రంగ వైభవంగా' సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. 

ఈ సినిమాలో ఆమె వైష్ణవ్ తేజ్ జోడీగా అలరించనుంది. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, వచ్చేనెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో నిర్మితమైంది. ఈ సినిమా తేడా కొడితే తన కెరియర్ కష్టాల్లో పడుతుందని కేతిక టెన్షన్ పడుతోందట. కానీ ఈ సినిమా ట్రైలర్ .. సాంగ్స్ చూస్తుంటే హిట్ కొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  

More Telugu News