Telangana: 'మీ సేవ'కు గుర్తింపు... తెలంగాణ ప్రభుత్వానికి మరో అవార్డు

Telangana govt gets another award at national level
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పురస్కారం
  • తెలంగాణకు అవార్డు ప్రకటించిన ఎకనామిక్ టైమ్స్
  • ఢిల్లీలో డిజిటెక్ కాంక్లేవ్-2022
  • అవార్డు అందుకున్న మంత్రి కేటీఆర్
జాతీయస్థాయిలో తెలంగాణ పేరు మరోసారి ఘనంగా వినిపించింది. 'మీ సేవ' ద్వారా తెలంగాణ సర్కారు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా విశిష్ట పురస్కారం లభించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద 'ఎకనామిక్ టైమ్స్' మీడియా మ్యాగజైన్ ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జరిగిన డిజిటెక్ కాంక్లేవ్-2022 కార్యక్రమానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 'ఎకనామిక్స్ టైమ్స్' పురస్కారాన్ని అందుకున్నారు. 

'మీ సేవ' ద్వారా మెరుగైన రీతిలో, నాణ్యమైన డిజిటల్ సేవలు అందిస్తున్నారని 'ఎకనామిక్ టైమ్స్' వర్గాలు కొనియాడాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నాయి. కాగా, ఈ అవార్డుకు తెలంగాణను ఎంపిక చేసే క్రమంలో, 'ఎకనామిక్ టైమ్స్' వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల నివేదికలను పరిశీలించడంతో పాటు, క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహించింది.
Telangana
Award
Mee Seva
KTR
Economic Times
New Delhi

More Telugu News