నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' ట్రైలర్ ను ఆవిష్కరించిన మహేశ్ బాబు

  • నాగార్జున హీరోగా ది ఘోస్ట్
  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ మూవీ
  • అక్టోబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్
  • యాక్షన్ దృశ్యాలతో థియేట్రికల్ ట్రైలర్ 
Mahesh Babu launches The Ghost theatrical trailer

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న హైఓల్టేజ్ యాక్షన్ మూవీ 'ది ఘోస్ట్'. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నేడు సోషల్ మీడియాలో ఆవిష్కరించారు. ఎంతో తీవ్రతతో కూడిన 'ది ఘోస్ట్' ట్రైలర్ ను ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటూ మహేశ్ బాబు స్పందించారు. నాగార్జునతో పాటు యావత్ చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు 'ది ఘోస్ట్' ట్రైలర్ వీడియోను కూడా పంచుకున్నారు. 

ట్రైలర్ చూస్తేనే సినిమాలో యాక్షన్ కు ఎంతటి ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థమవుతోంది. ఈ చిత్రం అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో నాగ్ సరసన సోనాలీ చౌహాన్ కథానాయికగా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

More Telugu News