లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన మదుపరులు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

25-08-2022 Thu 16:30 | Business
  • 310 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 82 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 1.81 శాతం పతనమైన బజాజ్ ఫైనాన్స్ షేర్ విలువ
Markets ends in losses
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు... భారీ లాభాల్లోనే కొనసాగాయి. అయితే చివర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో చివరకు నష్టాల్లో ముగిశాయి. ఎఫ్ అండ్ ఓల గడువు ముగియడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. 

ఈ ల్రామంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 310 పాయింట్ల నష్టంతో 58,774కి పడిపోయింది. నిఫ్టీ 82 పాయింట్లు కోల్పోయి 17,522 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (0.46%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.27%), డాక్టర్ రెడ్డీస్ (0.20%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.06%), టైటాన్ (0.02%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.33%), ఇన్ఫోసిస్ (-1.20%), టీసీఎస్ (-1.14%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.11%).