Katari Eshwar Kumar: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో కొడాలి నాని ఫొటో.. తొలగించకుంటే ధర్నా చేస్తానంటున్న మాజీ మంత్రి కఠారి

katari eshwar kumar demands to remove kodali nani photo from municipal Office
  • కొడాలి నాని ఫొటో ఇంకా ఉండడంపై కఠారి ఈశ్వర్ కుమార్ అభ్యంతరం
  • మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడిన మాజీ మంత్రి
  • ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి, ప్రధాని, సీఎం ఫొటోలు మాత్రమే ఉండాలన్న కఠారి
  • వారం రోజుల్లో తొలగించాలని అల్టిమేటం
గుడివాడ మున్సిపల్ శాఖ కార్యాలయంలో గతంలో ఏర్పాటు చేసిన కొడాలి నాని ఫొటోను తొలగించాల్సిందేనని, లేదంటే ధర్నా చేస్తానని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ అధికారులను హెచ్చరించారు. నాని మంత్రిగా ఉన్నప్పుడు కార్యాలయ ద్వారం వద్ద ఆయన ఫొటోను ఏర్పాటు చేశారు. ఆయన ఫొటో ఇంకా అక్కడే ఉండడంపై కఠారి ఈశ్వర్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

నిన్న మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్‌తో ఫోన్లో మాట్లాడిన ఆయన ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఫొటోలు మాత్రమే ఉండాలని, మంత్రులు, ఎమ్మెల్యేల ఫొటోలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. వారం రోజుల్లో కొడాలి నాని ఫొటో తొలగించాలని, లేదంటే ధర్నా చేస్తానని సంపత్ కుమార్‌కు చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, ఆ ఫొటో స్థానంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను ఏర్పాటు చేయాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది.
Katari Eshwar Kumar
Kodali Nani
Gudivada

More Telugu News