ప్రియాంకా గాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
- కోమటిరెడ్డికి స్వయంగా కబురు పంపిన ప్రియాంక
- ప్రియాంకా గాంధీతో ఏకాంతంగా భేటీ అయిన కోమటిరెడ్డి
- సమస్య ఉంటే తనను నేరుగా కలవాలని కోమటిరెడ్డికి సూచన
ఈ భేటీ ముగిశాక బయటకు వచ్చిన కోమటిరెడ్డి అక్కడే మీడియాతో మాట్లాడారు. పార్టీలో నేతలంతా కలసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని ప్రియాంకా గాంధీ చెప్పినట్లుగా ఆయన వివరించారు. అదే సమయంలో ఏదేనీ సమస్య ఉంటే...ఎప్పుడైనా నేరుగా వచ్చి తనతో కలవవచ్చని కూడా తెలిపారన్నారు. ఇక భేటీలో పార్టీ పటిష్ఠత, వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించినట్లు తెలిపారు. ఈ విషయాలకు సంబంధించి తాను ప్రియాంకకు కొన్ని సలహాలు ఇచ్చినట్లు కోమటిరెడ్డి చెప్పారు.