కుప్పం మీద ప్రేమ పుట్టిందా?.. కుప్పం అంటే భయం పట్టిందా?: అంబ‌టి రాంబాబు

  • కుప్పం చేరిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు
  • కుప్పంలో బాబు టూర్‌పై అంబ‌టి సెటైర్లు
  • ప‌దే ప‌దే కుప్పం వెళ్తున్న చంద్రబాబు అంటూ వ్యాఖ్య‌
ambati rambabu satires on chandrababu kuppam tour

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు బుధ‌వారం త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పం ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ నుంచి విమానం ద్వారా బెంగ‌ళూరు చేరిన చంద్ర‌బాబు... అక్క‌డి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకున్నారు. బుధ‌వారం నుంచి మొద‌లైన చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న మూడు రోజుల పాటు కొన‌సాగ‌నుంది.

ఈ సంద‌ర్భంగా కుప్పం ప‌ర్య‌ట‌న‌కు చంద్ర‌బాబు బ‌య‌లుదేరుతున్న స‌మ‌యాన ఏపీ జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు సంధించారు. 'పదే పదే కుప్పం వెళ్తున్న బాబు గారు, కుప్పం మీద ప్రేమ పుట్టిందా?, కుప్పం అంటే భయం పట్టిందా?' అంటూ చంద్ర‌బాబును ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్య‌లు చేశారు.

More Telugu News