Delhi Liquor Scam: లిక్క‌ర్ స్కాంలో క‌విత‌పై ఆరోప‌ణ‌లు చేయ‌రాదు... సిటి సివిల్ కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు

  • ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌విత‌కు పాత్ర ఉందంటూ ఆరోప‌ణ‌లు
  • ఆరోపణ‌ల‌పై సిటీ సివిల్ కోర్టులో కవిత పిటిష‌న్ ‌
  • ఆరోప‌ణ‌లు చేసిన బీజేపీ ఎంపీల‌కు నోటీసులు జారీ చేసిన కోర్టు
  • విచార‌ణ‌ను సెప్టెంబ‌ర్ 13కు వాయిదా వేసిన వైనం
city civil court notices to bjp leaders over delhi liquor scam allegations over mlc kavitha

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల పాత్ర‌, ప్ర‌త్యేకించి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ క‌విత‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు బుధ‌వారం మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ వ్య‌వ‌హారంలో ఇక‌పై క‌విత‌కు సంబంధించి ఎలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌రాద‌ని కోర్టు త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. మీడియాలోనే కాకుండా సోష‌ల్ మీడియాలో కూడా క‌వితపై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయరాద‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ స్కాంలో క‌వితకు పాత్ర ఉందంటూ బీజేపీకి చెందిన ఢిల్లీ ఎంపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై సిటి సివిల్ కోర్టులో క‌విత పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టిన కోర్టు... క‌విత‌పై ఆరోప‌ణ‌లు చేసిన ఎంపీల‌కు నోటీసులు జారీ చేసింది. కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను సెప్టెంబ‌ర్ 13వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News