Jeevitha Rajasekhar: పబ్బులు, క్లబ్బుల్లో కేటీఆర్ కు వాటాలు ఉన్నాయి: జీవిత

  • తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎన్ని? అని ప్రశ్నించిన జీవిత 
  • బండి సంజయ్ ని పాదయాత్రకు అనుమతించాలని డిమాండ్ 
  • మునుగోడులో టీఆర్ఎస్ కు ఘోర పరాభవం తప్పదని హెచ్చరిక 
KTS has share in Clubs and Pubs sasy Jeevitha

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై బీజేపీ నాయకురాలు, సినీ నటి జీవిత విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని? అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగారు. పబ్బులు, క్లబ్బుల్లో కేటీఆర్ కు వాటాలు ఉన్నాయని... ఈ విషయాన్ని తనకు చాలా మంది పబ్బులు, క్లబ్బుల యజమానులు చెప్పారని అన్నారు. 

తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని జీవిత మండిపడ్డారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం సరి కాదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే బండి సంజయ్ ను విడుదల చేసి, పాదయాత్రకు అనుమతించాలని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే పాదయాత్రలు చేయాలని సవాల్ విసిరారు.

 ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తప్పు చేయనప్పుడు... అసలు వాస్తవం ఏమిటో చెప్పాలని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన దీక్షలో జీవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు.

More Telugu News