దూసుకుపోతున్న 'కోబ్రా' తెలుగు టీజర్!

  • విక్రమ్ హీరోగా రూపొందిన 'కోబ్రా'
  • కథానాయికగా శ్రీనిధి శెట్టి 
  • కీలకమైన పాత్రలో ఇర్ఫాన్ పఠాన్ 
  • ఈ నెల 31వ తేదీన సినిమా రిలీజ్
Cobra telugu teaser released

విక్రమ్ హీరోగా 'కోబ్రా' సినిమా రూపొందింది. సెవెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో కథానాయికగా శ్రీనిధి శెట్టి కనిపించనుంది.

నిన్న ఈ సినిమా నుంచి తెలుగు టీజర్ ను వదిలారు. విక్రమ్ తో పాటు ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తించింది. చాలా ఫాస్టుగా ఈ టీజర్ 3 మిలియన్ ప్లస్ వ్యూస్ ను దక్కించుకోవడం విశేషం. ఏఆర్ రెహ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా అనిపించేలా ఉంది. విక్రమ్ ఎప్పటిలానే విలక్షణమైన నటనను కనబరిచాడు. 

ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసినట్టుగా టీజర్ ను చూస్తేనే తెలుస్తోంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విక్రమ్, ఈ సినిమాతో ఆ నిరీక్షణ ఫలిస్తుందని భావిస్తున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ .. కేఎస్ రవికుమార్ .. సత్యదేవ్ .. మృణాళిని రవి .. మియా జార్జ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

More Telugu News