Devendra Fadnavis: బిల్కిస్ బానో రేప్ కేసు దోషులకు ఘన సన్మానం చేయడం తప్పే: ఫడ్నవిస్

  • జైలు నుంచి విడుదలైన బిల్కిస్ బానో అత్యాచార ఘటన దోషులు
  • వీరికి ఘన సన్మానం చేసిన కొందరు వ్యక్తులు
  • జైలు నుంచి విడుదలైనా దోషులు దోషులేనన్న ఫడ్నవిస్
It Was Wrong Felicitation Of Bilkis Bano Convicts says Devendra Fadnavis

2002 నాటి గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై జరిగిన అత్యాచార ఘటనలో దోషులు జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైన వీరికి బయట ఘన స్వాగతం లభించింది. వీరికి సన్మానం కూడా చేశారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దోషులు విడుదల కావడాన్ని వివిధ రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, ఈ అంశంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ... జైలు నుంచి విడుదలైన వారికి ఘన స్వాగతం పలకడాన్ని విమర్శించారు. దోషి అంటే దోషేనని... వారికి సన్మానాలు జరపడం సరికాదని అన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు దోషులను విడుదల చేశారని చెప్పారు. ఈ అంశాన్ని చట్టసభల్లో చర్చించడం అనవసరమని తెలిపారు.

More Telugu News