Swapna Dutt: మా ప్రేమ పెళ్లి జరగడానికి జూనియర్ ఎన్టీఆరే కారణం: అశ్వనీదత్ కుమార్తె స్వప్న

My love marriage happened because of Junior NTR says Swapna Dutt
  • ప్రసాద్ వర్మను ప్రేమ వివాహం చేసుకున్న స్వప్న దత్
  • తన ప్రేమ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పిన స్వప్న
  • అశ్వనీదత్ తో మాట్లాడి ఒప్పించిన తారక్
ఆర్ఆర్ఆర్' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పేరు నార్త్ లో కూడా మారుమోగుతోంది. తారక్ అద్భుత నటనకు సినీ అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. మరోవైపు, తారక్ లో ఒక మంచి నటుడే కాకుండా, ఒక మంచి స్నేహితుడు కూడా ఉన్నారు. తన అనుకున్న వారి కోసం ఆయన ఏమి చేయడానికైనా సిద్ధమేనని ఆయన సన్నిహితులు చెపుతుంటారు. మరోవైపు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె స్వప్న దత్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తమ ప్రేమ పెళ్లి జరగడానికి జూనియర్ ఎన్టీఆరే కారణమని చెప్పారు. 

ఎన్టీఆర్ తో అశ్వనీదత్ 'శక్తి' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ షూటింగ్ సమయంలో ప్రసాద్ వర్మతో తాను ప్రేమలో ఉన్నానని... ఆ విషయాన్ని తారక్ తో చెప్పానని స్వప్న దత్ తెలిపారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పమని తారక్ తనకు సూచించాడదని... కానీ తమ ప్రేమను ఇంట్లో అంగీకరించే పరిస్థితి లేదని చెప్పారు. దీంతో, ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదని, అశ్వనీదత్ గారితో తాను మాట్లాడతానని తారక్ చెప్పారని... తన తండ్రితో మాట్లాడి ఒప్పించారని తెలిపారు. తారక్ వల్లే తన ప్రేమ వివాహం జరిగిందని చెప్పారు. 2010లో స్వప్న దత్, ప్రసాద్ వర్మల వివాహం జరిగింది.
Swapna Dutt
Love Marriage
Junior NTR

More Telugu News