ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు

  • ఈ నెల 25 వరకు ఎలక్ట్రానిక్స్ సేల్
  • ఎస్బీఐ కార్డులతో కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్
  • ఐఫోన్ 12 రూ.54,000కే
Flipkart Electronics sale begins Top 10 phone deals you cant miss

ఇండిపెండెన్స్ డే సేల్ తర్వాత ఫ్లిప్ కార్ట్ మరో విడత ఆఫర్లతో కూడిన విక్రయాలు మొదలు పెట్టింది. ఎలక్ట్రానిక్స్ సేల్ ను ఈ నెల 25 వరకు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎస్బీఐ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్చేంజ్ డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. 

యాపిల్ ఐఫోన్ 12 రూ.65,900కు సాధారణ రోజుల్లో లభిస్తుంటే, ఇప్పుడు దీన్ని రూ.53,999కే (64 జీబీ వేరియంట్) సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.11,901 తగ్గింపు లభిస్తోంది. అలాగే, శామ్ సంగ్ గెలాక్సీ 23 5జీ ఫోన్ ను ఈ ఏడాది ఆరంభంలో కంపెనీ రూ.17,499కు తీసుకురాగా, ఎలక్ట్రానిక్స్ సేల్ లో దీన్ని ధర రూ.14,999కే సొంతం చేసుకోవచ్చు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ తో, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ పనిచేస్తుంది. 25 వాట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. కానీ, బాక్స్ లో చార్జర్ అందించడం లేదు. 

మోటరోలా జీ52 ఫోన్ ధర రూ.14,999 ఉండగా, ఎస్బీఐ కార్డుపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ 13 ధర రూ.73,999. అమెజాన్ అయితే రూ.70,900కే విక్రయిస్తోంది. బ్యాంకు కార్డులను ఉపయోగించి కొనుగోలు చేయడం ద్వారా ఇంకా తక్కువకే దక్కించుకోవచ్చు. 

బేసిక్ ఫోన్ కావాలనుకునే వారికి రియల్ మీ సీ11 (2021) సరిపోతుంది. ఫ్లిప్ కార్ట్ లో దీని ధర రూ.7.499. ఎస్బీఐ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్ ను ఎక్చేంజ్ చేసుకుంటే గరిష్ఠంగా రూ.6,950 వరకు తగ్గుతుంది. మోటో జీ32 ఫ్లిప్ కార్ట్ పై రూ.11,999కు లభిస్తోంది. 

More Telugu News