Chiranjeevi: చరిత్రలో గుర్తుండిపోయే చిరంజీవి పుట్టినరోజు వేడుకల మెగా కార్నివాల్... వీడియో ఇదిగో!

Chiranjeevi birthday celebrations mega carnival video
  • ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం
  • ఈసారి రెండు వారాల ముందే వేడుకలు షురూ
  • మాదాపూర్ లో మెగా కార్నివాల్
  • అంబరాన్నంటిన అభిమానుల జోష్
గత నాలుగున్నర దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న పుట్టినరోజు జరుపుకున్నారు. నవయువకులకు దీటుగా 67 ఏళ్ల వయసులోనూ తరగని ఉత్సాహంతో, వరుస సినిమాలతో చిరంజీవి దూసుకెళుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న చిరంజీవి ఫొటోలు చూస్తే ఆయన వయసెంతో చెప్పడం కష్టమే! 

ఇక, ఆయన జన్మదినం అంటే అభిమానులకు పండుగే. ఈసారి రెండువారాల ముందే చిరు పుట్టినరోజు వేడుకల సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ రూపాల్లో మెగా నామస్మరణ చేస్తూ, అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. బైక్ ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్లాష్ మాబ్ డ్యాన్సులు, ఊరేగింపులు, స్టేజ్ ఈవెంట్లు... ఇలా అనేక రకాల కార్యక్రమాల ద్వారా అభిమానులు చిరంజీవిపై తమ ప్రేమను చాటుకున్నారు.

ఈ మెగా బర్త్ డే సంబరాలకు చివరిరోజున హైదరాబాద్ మాదాపూర్ లో మెగా కార్నివాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అభిమానులు తమ ఆరాధ్య హీరోకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చరితార్థుడి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కి చరిత్రలో గుర్తుండిపోయే అభిమానుల మెగా కార్నివాల్ అంటూ ఓ లీడ్ క్యాప్షన్ తో ఈ వీడియో ప్రారంభమవుతుంది.
Chiranjeevi
Bitrhday
Celebrations
Mega Carnival
Tollywood

More Telugu News