రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతల మృతి... సంతాపం తెలిపిన చంద్రబాబు
- చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం
- మృత్యువాత పడ్డ భాను ప్రకాశ్ రెడ్డి, గంగపల్లి భాస్కర్
- తీవ్రంగా గాయపడ్డ సోమశేఖర్ రెడ్డి
చిత్తూరు జిల్లా పరిధిలో మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చంద్రగిరి మండల తెలుగు యువత అధ్యక్షుడు భానుప్రకాశ్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి గంగపల్లి భాస్కర్‌లు అక్కడికక్కడే మరణించారు. వారితో పాటు ప్రయాణిస్తున్న ఐ-టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ సోమశేఖర్ రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్న చంద్రబాబు... సోమశేఖరరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.