Zimbabwe: శుభ్ మన్ గిల్ కు ఈ జింబాబ్వే బౌలర్ పెద్ద అభిమాని

Zimbabwe bowler Evans brings Shubman Gills jersey to press conference
  • గిల్ జెర్సీ కోరిన ఎవాన్స్
  • మ్యాచ్ తర్వాత ఇద్దరూ జెర్సీల మార్పిడి
  • గిల్ ఇచ్చిన జెర్సీతో మీడియా సమావేశానికి వచ్చిన ఎవాన్స్
భారత ఓపెనర్ శుభమన్ గిల్ కు తాను పెద్ద అభిమానినని జింబాబ్వే బౌలర్ బ్రాడ్ ఎవాన్స్ చెప్పాడు. సోమవారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడో వన్డే హరారేలో జరిగిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0 ఆధిపత్యంతో గెలుచుకుంది.

ఈ మ్యాచ్ లో బ్రాడ్ ఎవాన్స్ 10 ఓవర్లు వేసి 50 పరుగులకే 5 వికెట్లు తీసి భారత్ ఆధిపత్యాన్ని కొంత వరకు తగ్గించాడు. అతడు తీసిన వికెట్లలో తాను అభిమానించే గిల్ కూడా ఉండడం గమనార్హం. ఇదే మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ 130 పరుగులతో తన ఖాతాలో శతకం వేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం గిల్ తన టీషర్ట్ ను ఎవాన్స్ కు కానుకగా ఇచ్చాడు. 

గిల్ ఇచ్చిన జెర్సీని మ్యాచ్ తర్వాత మీడియా సమావేశానికి బ్రాడ్ ఎవాన్స్ తీసుకొచ్చాడు. ‘‘నేను కూడా ఒకానొక పెద్ద అభిమానిని. అందుకే ఈ షర్ట్ నాకు దక్కింది. అతడు ప్రపంచస్థాయి ఆటగాడు. సింగిల్ వచ్చినా కానీ, బ్యాట్ తో గట్టిగా కొడతాడు. ఆ నైపుణ్యం ఏళ్ల తరబడి సాధనతో కానీ రాదు. అతడ్ని నేను లోగడ ఐపీఎల్ లో, ఆస్ట్రేలియాలో చూశాను. అందుకే అతడికి అభిమానిగా మారాను. అతడిపై ఆడడం అద్భుతంగా ఉంది’’ అని ఎవాన్స్ తెలిపాడు. 

మూడో వన్డే మ్యాచ్ కు ముందే జెర్సీలు మార్చుకుందామని అనుకున్నట్టు ఎవాన్స్ తెలిపాడు. ‘‘మ్యాచ్ ముగిసిన వెంటనే నేను గిల్ వద్దకు వెళ్లి నా టీషర్ట్ ఇచ్చేశాను. దీంతో అతడు కూడా తన టీషర్ట్ తీసి నాకు ఇచ్చాడు. భవిష్యత్తులో ఐపీఎల్ లో ఆడాలని ఉంది’’ అని ఎవాన్స్ పేర్కొన్నాడు. 
Zimbabwe
bowler
Brad Evans
Shubman Gill
jersey
exchange

More Telugu News