Teja sajja: 'హను మాన్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్!

  • 'హనుమాన్' గా తేజ సజ్జ 
  • దర్శకుడిగా ప్రశాంత్ వర్మ 
  • కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ 
  • త్వరలో ఐదు భాషల్లో విడుదల 
Hanuman movie poster released

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన 'జాంబిరెడ్డి' విజయాన్ని సాధించింది. తేజ సజ్జ కెరియర్ కి ఈ సినిమా మంచి హెల్ప్ అయింది. ఆ తరువాత ఇదే కాంబినేషన్ లో 'హనుమాన్' రూపొందుతోంది. టైటిల్ దగ్గర నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాన్సెప్ట్ ఏమిటా అనే కుతూహలం అందరిలో మొదలయ్యేలా చేసింది.

ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ రీసెంట్ గా అయితే రాలేదు. ఈ రోజున తేజ సజ్జ పుట్టినరోజు కావడంతో, ఆయనకి విషెస్ చెబుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. తలపాగా చుట్టి  .. ఎద్దులబండిపై వెళుతూ, ఒక గ్రామీణ కుర్రాడిగా ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ మాస్ లుక్ లో ఆయన ఆకట్టుకుంటున్నాడు. 

దసరాకి ఈ సినిమా నుంచి బిగ్ అప్ డేట్ ఉంటుందని ప్రశాంత్ వర్మ మరింత ఆసక్తిని పెంచాడు. తేజ సజ్జ సరసన నాయికగా అమృత అయ్యర్ నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు..

More Telugu News