Vijay Devarakonda: స్టేజ్ పై డాన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు: విజయ్ దేవరకొండ

Liger movie update
  • 'లైగర్' ప్రమోషన్స్ లో బిజీగా విజయ్ దేవరకొండ
  • ముంబై రెస్పాన్స్ మామూలుగా లేదంటూ హర్షం 
  • ఎక్కడికెళ్లినా పబ్లిక్ మామూలుగా రాలేదంటూ వెల్లడి 
  • ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల  
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందింది. ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. తాను ఇంతకుముందు ఒకే ఒక్కసారి ముంబై వెళ్లాననీ, మళ్లీ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లానని చెప్పాడు.

"ముంబైలోని షాపింగ్ మాల్ లో ప్రమోషన్ అనగానే, అందరినీ రండి బాబూ అంటూ పిలిచి ఈ సినిమా గురించి చెప్పాలేమో అని చార్మీ మేడమ్ తో కూడా అన్నాను. కానీ అక్కడి రెస్పాన్స్ చూసిన తరువాత నేను షాక్ అయ్యాను. ముఖ్యంగా యూత్ నుంచి అంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. అసలు యాక్టర్ ను అవుతాననే అనుకోలేదు. అలాంటి నాకు అక్కడ అంత ఫాలోయింగ్ ఉండటం చూసి ఆశ్చర్యపోయాను" అన్నాడు.

 "ఈ సినిమా కోసం ఏదైనా ఈవెంట్ కి వెళ్లినప్పుడు ఇలా చేద్దాం అని ముందుగా అనుకుంటాము. కొన్నిసార్లు స్టేజ్ పై ఒక స్టెప్పు వేయమంటారు. స్టేజ్ పై డాన్సులు చేయడం నాకు ఇష్టం ఉండదు. జనం ఎక్కువగా ఉంటే వెంటనే కానిచ్చేయమంటారు. డాన్స్ చేసే బాధ తప్పినందుకు కొన్ని సార్లు హ్యాపీగా ఫీలవుతాను" అని చెప్పుకొచ్చాడు. 

Vijay Devarakonda
Ananya Pandey
Liger Movie

More Telugu News