Vijay Devarakonda: బెంగళూరులో విజయ్ దేవరకొండ మేనియా... రింగ్ తొడిగి ప్రపోజ్ చేసిన అమ్మాయి

Girl proposes to Vijay Devarakonda
  • విడుదలకు సిద్ధమవుతున్న లైగర్
  • ప్రమోషన్స్ తో విజయ్ దేవరకొండ బిజీ
  • బెంగళూరులో ఈవెంట్
  • విజయ్ ను చూసి ఉబ్బితబ్బిబ్బయిన తేజు అనే యువతి

యంగ్ హీరో విజయ్ దేవరకొండ అమ్మాయిల కలల రాకుమారుడు ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు. విజయ్ కొత్త చిత్రం లైగర్ ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లగా, ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. తేజు అనే అమ్మాయి తన ఆరాధ్య హీరోను ఎదురుగాచూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. అంతేకాదు, దిష్టి తగలకుండా అప్పటికప్పుడు ఓ ఉంగరం తొడిగి తన ప్రేమను వెల్లడించింది. ఆమె ప్రపోజ్ చేసిన తీరు పట్ల విజయ్ సహృదయతతో స్పందించాడు. ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. అంతేకాదు, లైగర్ ప్రమోషన్లు పూర్తయ్యేదాకా ఆమె తన వేలికి తొడిగిన రింగ్ ను తీయనని మాటిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

లైగర్ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టయినర్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించారు. ఇందులో మహాబలుడు మైక్ టైసన్ కీలకపాత్ర పోషించడం విశేషం. రమ్యకృష్ణ ఈ చిత్రంలో విజయ్ తల్లిగా ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది.

  • Loading...

More Telugu News