India: శ్రీలంక పట్ల కొనసాగుతున్న భారత్ ఔదార్యం... 21 వేల టన్నుల ఎరువుల అందజేత

  • సంక్షోభంతో శ్రీలంక సతమతం
  • పలు దఫాలుగా సాయం చేసిన భారత్
  • మరోమారు ఆపన్న హస్తం
  • వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఎరువుల అందజేత
India give 21 tonnes fertilizers to Sri Lanka

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు భారత్ మరోసారి ఆపన్నహస్తం అందించింది. తాజాగా 21 వేల టన్నుల ఎరువులను శ్రీలంకకు అందించింది. గత నెలలో లంకకు భారత్ 44 వేల టన్నుల ఎరువులు అందించింది. ఆహార పదార్థాలు, అత్యవసర ఔషధాలు, చమురును ఇప్పటికే భారత్ పలు దఫాలుగా ద్వీపదేశానికి సౌహార్ద్రపూరితంగా సరఫరా చేసింది. ఇప్పటిదాకా శ్రీలంకకు భారత్ చేసిన సాయం 4 బిలియన్ డాలర్లకు చేరింది. 

తాజాగా ఎరువులు అందజేసిన వైనంపై శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్న భారత హైకమిషన్ వర్గాలు స్పందించాయి. ఇరుదేశాల మధ్య మైత్రి, సహకారం ఇకపైనా కొనసాగుతాయని పేర్కొన్నాయి. భారత్ ఎరువులు అందజేయడం ద్వారా లంకలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చినట్టయింది.

More Telugu News