Motorola: సెప్టెంబర్ 8న మోటరోలా నుంచి కొత్త ఫోన్లు

Motorola to launch new Edge series smartphone in India on September 8
  • మోటో ఎడ్జ్ 2022 విడుదల
  • మోటో ఎక్స్ 30 ప్రో లేదా ఎస్30 ప్రో
  • రూ.35,000-40,000 మధ్యలో ధర
ప్రముఖ చైనీ కంపెనీ లెనోవోకు చెందిన మోటరోలా.. ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. సెప్టెంబర్ 8న వర్చువల్ గా నిర్వహించే కార్యక్రమం ఇందుకు వేదికగా నిలవనుంది. డైమెన్సిటీ 1050 చిప్ సెట్ తో కూడిన మోటరోలా ఎడ్జ్ (2022) ఫోన్ ను పరిచయం చేయనుంది. 

అలాగే, మోటో ఎక్స్ 30 ప్రో లేదా మోటో ఎస్ 30 ప్రో  మోడల్ ను కూడా విడుదల చేసే అవకాశాలున్నాయి. మోటరోలా ఎడ్జ్ 2022 ఫోన్ ఈ నెల మొదట్లోనే అమెరికాలో విడుదల కావడంతో, మన మార్కెట్ కు కూడా త్వరలోనే వచ్చేస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. డైమెన్సిటీ 1050 చిప్ తో వస్తున్న తొలి ఫోన్ ఇది.

ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, 144 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. అందులో 50 మెగాపిక్సల్ తో ప్రధాన కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ టర్బో పవర్ చార్జర్ తదితర ఫీచర్లున్నాయి. అమెరికాలో దీని ధర రూ.40,000గా ఉంది. భారత్ లోనూ ఇంచుమించు ఇదే ధరలో ఉండనుంది. సెప్టెంబర్ 8 నాటి కార్యక్రమంలో మోటరోలా ఇంకా ఏవేవి విడుదల చేయనున్నదీ, ఆ రోజు వస్తే కానీ తెలియదు.
Motorola
launch
Edge series
smartphone

More Telugu News