Allari Naresh: 'ఉగ్రం' నుంచి అల్లరి నరేశ్ ఫస్టులుక్ పోస్టర్!

  • విజయ్ కనకమేడలతో 'నాంది' చేసిన అల్లరి నరేశ్ 
  • భారీ వసూళ్లను రాబట్టిన సినిమా అది 
  • అదే కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఉగ్రం'
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న ఫస్టు పోస్టర్  
Ugram First Look Poster Released

అల్లరి నరేశ్ హాస్య కథానాయకుడిగా చకచకా 50 సినిమాలను పూర్తి చేసుకున్న హీరో. అప్పుడప్పుడు ఆయన విలక్షణమైన పాత్రలను కూడా చేస్తూ తన సత్తా చాటుకున్నాడు. అలా ఆ మధ్య వచ్చిన 'నాంది' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. నూతన దర్శకుడు విజయ్ కనకమేడలకు ఈ సినిమా మంచి పేరు తీసుకుని వచ్చింది. 

అదే దర్శకుడితో అల్లరి నరేశ్ ఇప్పుడు 'ఉగ్రం' సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా నుంచి కొంత సేపటి క్రితం ఆయన పోస్టర్ ను రిలీజ్ చేశారు. వీపులో దిగబడిన 'కత్తి'తో .. రక్తసిక్తమైన శరీరంతో .. ఆవేశం .. ఆక్రోశంతో హీరో అరుస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. మొత్తానికి టైటిల్ కి తగిన పోస్టర్ వదిలారు. 

సాహు గారపాటి -  హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. 'నాంది' తరువాత అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. 'నాంది' స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ప్రభావితం చేస్తుందేమో చూడాలి..

More Telugu News