Gouthu Sireesha: మా నాన్న గురించి తప్పుగా మాట్లాడారు కాబట్టే అలా అన్నా: గౌతు శిరీష

Gouthu Sireesha fired on minister seediri Appalaraju
  • పశువుల మంత్రిని మరి హోంమంత్రి అని పిలవాలా? అని ప్రశ్నించిన శిరీష
  • తన తండ్రి, తాత గురించి తప్పుగా మాట్లాడితే ఇలాగే ఉంటుందని వ్యాఖ్య
  • ఇప్పుడు వారు తిరుగుతున్న రోడ్లు టీడీపీ వేసినవేనన్న శిరీష
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య నిన్న తలెత్తిన ఉద్రిక్తత, గృహ నిర్బంధాలు, అరెస్టులపై టీడీపీ నాయకురాలు, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష స్పందించారు. మంత్రి సీదిరి అప్పలరాజును పశువుల మంత్రిగా ఎందుకు పిలవాల్సి వచ్చిందన్న దానిపై వివరణ ఇచ్చారు. తన తండ్రి గౌతు శివాజీ, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న తన తాత సర్దార్ గౌతు లచ్చన్నపై తప్పుగా మాట్లాడినందుకే సీదిరి అప్పలరాజును పశువుల మంత్రి అంటూ వ్యాఖ్యానించానన్నారు. 

పశువుల శాఖ మంత్రిని పశువుల మంత్రి అనాలా? లేదంటే హోం మంత్రి అని పిలవాలా? అని ప్రశ్నించారు. గత 60 ఏళ్ల కంటే ఈ మూడేళ్లలోనే పలాస ప్రాంతం అభివృద్ధి చెందిందన్న మంత్రి సీదిరి వ్యాఖ్యలపైనా స్పందించారు. 60 ఏళ్ల చరిత్రలో గౌతు కుటుంబం ఏం చేసిందని ప్రశ్నించారని, ఇప్పుడు వారు తిరుగుతున్న రోడ్లు టీడీపీ హయాంలో వేసినవేనని శిరీష గుర్తు చేశారు.
Gouthu Sireesha
Palasa
TDP
Appalaraju Seediri
YSRCP

More Telugu News