Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు జాగీరు కాదు.. ఇక్కడికొచ్చి లోకేశ్ సవాలు చేస్తే ఊరుకుంటామా?: మంత్రి సీదిరి అప్పలరాజు

AP Minister Seediri Appalaraju Slams Nara Lokesh
  • పలాస పర్యటనకు వెళ్లిన లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు
  • గత మూడేళ్లలో పలాస ఎంతో అభివృద్ధి చెందిందన్న మంత్రి 
  • పోలీసులు తనను కూడా నిర్బంధించారని వ్యాఖ్య 
పలాస పర్యటనకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఇతర టీడీపీ నేతలను అడ్డుకోవడం, ఈ సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోకేశ్, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడి జాగీరు కాదన్నారు. లోకేశ్ పలాస వచ్చి సవాలు చేస్తామంటే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. 

పలాస ప్రాంతంలో గత మూడేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. టీడీపీ నాయకురాలు గౌతు శిరీష రెచ్చగొట్టేలా మాట్లాడడం వల్లే తమ కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ముట్టడికి సిద్ధమయ్యారన్నారు. ఇది శాంపిల్ మాత్రమేనని హెచ్చరించారు. పలాసలో ఆక్రమణల వివరాలు ఇస్తే తానే దగ్గరుండి వాటిని తొలగింపజేస్తానన్నారు. పోలీసులు నిన్న తనను కూడా గృహనిర్బంధం చేశారన్న మంత్రి.. నిన్న పోలీసులు తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురిపించారు.
Nara Lokesh
Chandrababu
Seediri Appalaraju
Palasa

More Telugu News