తెలంగాణ‌లో కొత్త‌గా 357 క‌రోనా కేసులు

20-08-2022 Sat 21:52
  • హైద‌రాబాద్‌లో అత్య‌ధికంగా 165 కేసులు
  • క‌రోనా నుంచి కోలుకున్న 440 మంది
  • ఇంకా 2,711 మందికి కొన‌సాగుతున్న‌ చికిత్స
357 new corona cases in telangana
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 24,399 శాంపిల్స్ పరీక్షించగా, 357 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 165, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 31, రంగారెడ్డి జిల్లాలో 32 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 501 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 

అదే సమయంలో 440 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,31,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,24,800 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,711 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మృతి చెందారు.