కాకినాడ బీచ్ అందాలను వర్ణిస్తూ వీడియో పోస్ట్ చేసిన వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ
- గతంలో రిషికొండ బీచ్‌ను వర్ణిస్తూ ట్వీట్ చేసిన నత్వానీ
- తాజాగా కాకినాడ తీరాన్ని వర్ణిస్తూ వీడియో పోస్ట్ చేసిన వైనం
- ఆంధ్రా ప్రాంతానికి మాత్రమే సొంతమైన వంటకాలకు కేరాఫ్ అడ్రెస్ అంటూ కితాబు
ఏపీలోని కాకినాడ బీచ్ అహ్లాదకర వాతావరణంతో కూడుకున్నదని నత్వానీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా సెలవులను ప్రశాంతంగా ఆస్వాదించాలనుకునే వారికి ఈ బీచ్ చక్కగా సరిపోతుందని తెలిపారు. ఆంధ్రా ప్రాంతానికి మాత్రమే సొంతమైన వంటకాలకు కాకినాడ బీచ్ కేరాఫ్‌గా నిలుస్తోందని ఆయన తెలిపారు. ఇక కాకినాడ తీరానికి ఆనుకున్న ఉన్న వన్యప్రాణి ఆవాసాలు పర్యాటకులను మరింతగా ఆకట్టుకుంటాయని నత్వానీ తెలిపారు.