ఎప్పుడెప్పుడు మీకు 'లైగర్' చూపిస్తానా అనే ఆత్రంలో ఉన్నాను: విజయ్ దేవరకొండ

20-08-2022 Sat 20:03
  • ఈ నెల 25న రిలీజ్ కానున్న 'లైగర్'
  • బాక్సర్ గా కనిపించనున్న విజయ్ దేవరకొండ 
  • కథానాయికగా పరిచయమవుతున్న అనన్య పాండే
  • హిట్ ఖాయమంటూ చెప్పిన విజయ్ 
Liger movie update
విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమా రూపొందింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. 

ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ కొంతసేపటి క్రితం విజయవాడలో జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. " పాండమిక్ కారణంగా ఈ సినిమా కోసం మూడేళ్లపాటు వర్క్ చేయవలసి వచ్చింది. ఇక ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో థియేటర్లకు రానుంది. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ చేయడం జరిగిపోయింది.

 మీ అందరికీ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూపిస్తానా అని చాలా ఆత్రుతతో ఉన్నాను. ఈ సినిమా చూస్తూ ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతామనే నమ్మకం ఉంది. ఈ నెల 25వ తేదీన థియేటర్లకి వెళ్లండి" అంటూ చెప్పుకొచ్చాడు. చాలా గ్యాప్ తరువాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.